పీవీ సునీల్ కుమార్ పై అభియోగాలు
నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి – రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ ప్రక్షాళన ప్రారంభించింది. గత వైసీపీ సర్కార్ లో జగన్ రెడ్డికి బేషరతుగా సపోర్ట్ చేసిన పలువురు కీలక పోలీసు ఉన్నతాధికారులను టార్గెట్ చేసింది. ఇప్పటికే వివరణ ఇవ్వాలని కూడా కోరింది.
తాజాగా సీఐడీ మాజీ డీజీ ,ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది సర్కార్.
సోషల్ మీడియా లో సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రవర్తన నియమావళికి భిన్నంగా ఉన్నట్టు అభియోగ పత్రంలో పేర్కొంది. రఘురమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
గత ఏడాది జూలై 12 న సోషల్ మీడియా ద్వారా సునీల్ కుమార్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా ఇప్పటికే బదిలీ చేసి వెయిటింగ్ లో ఉంచింది సునీల్ కుమార్ ను. అయితే 15 రోజుల్లోపు అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.