NEWSTELANGANA

జ‌ర్న‌లిస్టుల‌పై క‌క్ష సాధింపు త‌గ‌దు

Share it with your family & friends

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కావాల‌ని జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ లో 118 జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థ‌లాల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెన‌క్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

రాజకీయ కక్షలో భాగంగా బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగిల్చడం శోచనీయమ‌ని వాపోయారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమ‌ని మండిప‌డ్డారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేయవద్దని, ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించు కోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు.