DEVOTIONAL

స‌ర్వ భూపాల వాహ‌నంపై మ‌ల‌య‌ప్ప‌

Share it with your family & friends

అంగ‌రంగ వైభ‌వోపేతంగా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనం ఇచ్చారు. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్త జన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.

వీరందరూ స్వామి వారిని తమ భుజ స్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

వాహ‌న సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో జె శ్యామల రావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ‌ధ‌ర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.