SPORTS

ఆ అభియోగాల‌న్నీ బ‌క్వాస్ – అజాద‌రుద్దీన్

Share it with your family & friends

ఈడీ ముందుకు మాజీ హెచ్ సీ ఏ చీఫ్

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు మ‌హమ్మ‌ద్ అజారుద్దీన్ మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి చేరుకున్నారు. ఆయ‌న‌కు ఈడీ ఇటీవ‌లే నోటీసులు జారీ చేసింది.

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ కు అధ్య‌క్షుడిగా ఉన్న అజారుద్దీన్ పై కేసు న‌మోదైంది. నిధుల‌ను దుర్వినియోగం చేశార‌ని, విచార‌ణకు ఆదేశించాల‌ని కోరారు. దీనిపై అజ్జూ విచార‌ణ నిమిత్తం హాజ‌రు కావాలంటూ నోటీస్ జారీ చేసింది ఈడీ.

ఇదిలా ఉండ‌గా ద‌ర్యాప్తు సంస్థ జారీ చేసిన నోటీసుల మేర‌కు ఇవాళ ఈడీ ఆఫీసు ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు.

విమ‌ర్శ‌లు అర్థ ర‌హిత‌మ‌ని, కావాల‌ని త‌న‌పై క‌క్ష క‌ట్టి ఫిర్యాదు చేశార‌ని ఆరోపించారు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్. త‌న‌పై త‌ప్పుడు అభియోగాలు మోపార‌ని, అదంతా అబ‌ద్ద‌మంటూ కొట్టి పారేశారు హెచ్ సీ ఏ మాజీ చీఫ్‌. మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ‌, టికెట్ల అమ్మ‌కాలు త‌దిత‌ర వాటిపై తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు అజ్జూ భాయ్.