NEWSTELANGANA

Share it with your family & friends

కాంగ్రెస్ మోసం ద‌క్కిన ప‌రాజ‌యం – హ‌రీశ్ రావు
హ‌ర్యానా రాష్ట్ర ఫ‌లితాల‌పై సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తాజాగా హ‌ర్యానా, జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

హ‌ర్యానా రాష్ట్రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ కాషాయ జెండా ఎగుర వేసింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల‌లో అడ్డ‌గోలు హామీలు ఇచ్చి, గ్యారెంటీల పేరుతో జ‌నాన్ని నిట్ట నిలువునా మోసం చేసిన విష‌యాన్ని హ‌ర్యానా ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌ని పేర్కొన్నారు.

దీంతో అబ‌ద్దాలు, ప‌చ్చి మోసాల‌కు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీకి హ‌ర్యానా ప్ర‌జ‌లు క‌ర్ర కాల్చి వాత పెట్టార‌ని, కోలుకోలేని రీతిలో బిగ్ షాక్ ఇచ్చార‌ని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెప్పాయ‌ని తెలిపారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారని పేర్కొన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందన్నారు.

ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు.