NEWSNATIONAL

హ‌ర్యానా ఫ‌లితాల‌పై ఈసీకి ఫిర్యాదు – కాంగ్రెస్

Share it with your family & friends

మేం గెలిచాం కానీ ప్ర‌జాస్వామ్యం ఓడి పోయింది

ఢిల్లీ – ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి జైరాం ర‌మేష్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా హ‌ర్యానా రాష్ట్రంలో వెల్ల‌డైన ఫ‌లితాల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ముచ్చ‌ట‌గా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రానుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని ద‌క్కించుకుంది.

ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్యానికి విరుద్ద‌మైన ఫ‌లిత‌మ‌ని పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి సిద్దంగా లేమ‌న్నారు జైరాం ర‌మేష్.

తాము గెలిచామ‌ని, ఎలా ఓడి పోతామంటూ ప్ర‌శ్నించారు . ఇది కాంగ్రెస్ ఓట‌మి కానే కాద‌న్నారు. ఇది పూర్తిగా డెమోక్ర‌సీ ఓట‌మిగా అభివ‌ర్ణించారు. రాష్ట్రంలో బీజేపీ పాల‌న రాచ‌రికాన్ని త‌ల‌పింప చేసింద‌న్నారు. ప్ర‌జ‌లు పూర్తి వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌ని, కానీ ఫ‌లితాలు ఇలా రావ‌డంపై తమ‌కు అనుమానం ఉంద‌న్నారు.

ఈ ఫ‌లితాల‌ను జీర్ణించుకోల‌క పోతున్నామ‌ని, ఈ మొత్తం ఫ‌లితాల స‌ర‌ళిపై తాము కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు జై రాం ర‌మేష్‌.