మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ
ఏపీలో 3,396 దుకాణాలకు 39,259 దరఖాస్తులు
అమరావతి – తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ తెలుగుదేశం కూటమి సర్కార్ కు మద్యం దుకాణాల వేలం పాట ద్వారా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ప్రజలకు సేవలు అందించాల్సిన సర్కార్ మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. గడువు కూడా విధించింది. ఇప్పటి వరకు భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 39,259 అప్లికేషన్లు రావడంతో గణనీయంగా ఆదాయం సమకూరింది.
ప్రతి దరఖాస్తు చేసుకునే వారు రూ. 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇవి తిరిగి రావు. అంటే నాన్ రిఫండబుల్ అన్నమాట. మద్యం దుఖాణాలు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 9 తేదీ వరకు గడువు విధించి ఏపీ సర్కార్.
వచ్చిన దరఖాస్తుల వెల్లువతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఏకంగా రూ. 785.18 కోట్ల ఆదాయం సమకూరింది. ఇవాళ 5 గంటల వరకు డెడ్ లైన్ ఉంది. అయితే దరఖాస్తుదారులు డెడ్ లైన్ తేదీని పెంచాలని కోరుతున్నారు. దసరా పండగ ఉండడంతో తాము అప్లై చేసుకునేందుకు సమయం ఇవ్వాలని అంటున్నారు.