మోసం చంద్రబాబు నైజం – ఎంపీ
నిప్పులు చెరిగిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రత్యేకించి ఏపీలో జరిగిన శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు విజయ సాయి రెడ్డి. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఆయనకు విలువలంటూ లేవన్నారు. కేవలం అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడని మండిపడ్డారు. చంద్రబాబుకు, తనయుడు నారా లోకేష్ కు కులమే ముఖ్యమని, వారికి దైవం మీద ప్రేమ లేదన్నారు.
కేవలం ప్రజలను నమ్మించేందుకే నాటకాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు విజయ సాయి రెడ్డి. విచిత్రం ఏమిటంటే ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత “ఫార్మ్ 20” వెబ్ సైట్ లో పెట్టిందని, పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చని తెలిపిందన్నారు.
.
ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ ప్లాన్ చేసిందని ఆరోపించారు. ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు ప్రస్తాదం తయారీలో కల్తీ జరిగిందంటూ తెర పైకి తీసుకు వచ్చారని అన్నారు ఎంపీ.
చంద్రబాబుకు నిజాలతో పనిలేదని, ఇది నెయ్యి కోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదని, ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకమని ఆరోపించారు విజయ సాయి రెడ్డి.
చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలక మండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.