27 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం
పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి
బెజవాడ – రాష్ట్రంలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాక పోయినా అన్ని పార్టీలు తమ దూకుడు పెంచాయి. ప్రధానంగా గత కొన్ని నెలల నుంచే కసరత్తు ప్రారంభించారు వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇందులో భాగంగా పలు చోట్ల సిట్టింగ్ లను మార్చారు. ఇంకొన్ని చోట్ల కొందరికి టికెట్లను ఇవ్వలేదు. మొత్తంగా రెండోసారి అధికారం లోకి రావాలని డిసైడ్ అయ్యారు. తాను చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమాతో ఉన్నారు.
పార్టీ గురువారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారని పేర్కొంది. జనవరి 27 నుంచి సీఎం జగన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలిపింది. క్యాడర్ తో సీఎం మహా సభ చేపట్టనున్నారని పేర్కొంది.
వైసీపీలో ఎమ్మెల్యే పదవి అయినా లేదా ఎంపీ పదవి అయినా లేక ఏ పదవి అయినా సరే ఓ బాధ్యత అని పేర్కొన్నారు ప్రభుత్వ సలహాదారు, పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. అందరూ కార్యకర్తలేనని పేర్కొన్నారు. మల్లాది విష్ణు పార్లమెంట్ పరిధిలో కేశినేని నానితో కలిసి పని చేస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.