కనక దుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్
అమ్మ వారికి పూజలు చేసిన కూతురు
విజయవాడ – నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు కూతురు ఆద్య కొణిదెల కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇవాళ శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారు సరస్వతీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు అమ్మ వారి ఆశీర్వాదం పొందేందుకు.
ఇదిలా ఉండగా మూలా నక్షత్రంలో శ్రీ కనక దుర్గమ్మను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం భక్తులకు. వేద పండితులు పూజలు జరిపించారు. అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూతురు ఆద్య కు వేద పండితులు వేదాశ్వీరచనాలు అందజేశారు. ప్రసాదం, అమ్మ వారి చిత్ర పటాన్ని బహూకరించారు.