శభాష్ నయాబ్ సింగ్ సైనీ – నరేంద్ర మోడీ
ముచ్చటగా మూడోసారి బీజేపీకి పవర్
ఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలతో ముంచెత్తారు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని. ఎవరూ ఊహించని రీతిలో ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ. భారీ మెజారిటీని సాధినందుకు శభాష్ అంటూ భుజం తట్టారు మోడీ. దీంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు హర్యానా సీఎం.
అభివృద్ధి చెందిన భారతదేశం తీర్మానంలో హర్యానా పాత్ర మరింత ముఖ్యమైనదిగా మారుతుందని తాను విశ్వసిస్తున్నాని ఈ సందర్బంగా స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందని అంచనా వేశాయి. అన్ని అంచనాలు తప్పడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం. తమను ప్రజలు ఆశీర్వదించారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు .