NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ దుష్ప్ర‌చారం లోకేష్ ఆగ్ర‌హం

Share it with your family & friends

మాజీ సీఎంకు ఇది మంచిది కాదు

అమ‌రావ‌తి – ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏపీ మాజీ సీఎం , వైసీపీ బాస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. బుధ‌వారం నారా లోకేష్ ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. వ‌ర‌ద బాధితుల‌కు అందించిన సహాయం, దానికి సంబంధించి అయిన ఖ‌ర్చు వివ‌రాల‌ను పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ దీనికి వ‌క్ర భాష్యం చెబుతూ జ‌గ‌న్ అండ్ ఫ్యాక్ట‌రీ త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు నారా లోకేష్. ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు.

ఇక వరద బాధితులకు ఇస్తామన్న కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నారా లోకేష్‌. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడని మండిప‌డ్డారు. వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదని పేర్కొన్నారు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివంటూ స్ప‌ష్టం చేశారు.

ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. . చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు అంటూ దిమ్మ తిరిగేలా కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి.