దేశానికి నిబద్దతతో సేవలు అందించా – సీజేఐ
వచ్చే నవంబర్ లో చంద్రచూడ్ పదవీ విరమణ
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నవంబర్ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్ తరానికి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులకు తాను వదిలిపెట్టబోయే వారసత్వం గురించిన ప్రశ్నలపై తాను ఆలోచిస్తున్నానని చెప్పారు.
భూటాన్లోని జేఎస్ డబ్ల్యూ లా స్కూల్ స్నాతకోత్సవంలో సీజేఐ మాట్లాడారు. వచ్చే నవంబర్ నెలలో నేను పదవీ విరమణ పొంద బోతున్నానని తెలిపారు. నా మనస్సు భవిష్యత్తు, గతం గురించిన భయాలతో ఎక్కువగా మునిగి పోయిందని పేర్కొన్నారు సీజేఐ.
తన ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి తాను ప్రయత్నించానని, దేశానికి అత్యంత అంకిత భావంతో సేవ చేసినందుకు సంతృప్తిగా ఉందని స్పష్టం చేశారు జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. మార్పు తీసుకు రావాలనే అచంచలమైన అభిరుచితో ముందుకు వెళ్లానని తెలిపారు. ప్రస్తుతం మారుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని యువ గ్రాడ్యూయేట్లు అంది పుచ్చుకోవాలని సూచించారు.