జగన్ దమ్ముంటే చర్చకు రా – హోం మంత్రి
సవాల్ విసిరిన వంగలపూడి అనిత
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. వరద సాయంపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బుధవారం సచివాలయంలో అనగాని సత్య ప్రసాద్, పొంగూరు నారాయణలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
వరద సాయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ ది ఫేక్ బతుకు అంటూ ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి లాగా తాము నిధులను దుర్వినియోగం చేయలేదని చెప్పారు అనిత వంగలపూడి. ఆరోపణలు చేసే వాళ్లకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
విపత్తు శాఖ నుంచి రూ.602 కోట్లు విడుదల చేస్తే..రూ.572 కోట్లు దుర్వినియోగం చేశామని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ లా ఎగ్ పఫ్ ల కోసం నిధులు దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వాళ్లతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దమ్ముంటే చర్చకు రావాలని జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై విచారణ జరుగుతోందని.. అనంతరం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.