రెడ్ బుక్ కు పోటీగా గుడ్ బుక్ – వైఎస్ జగన్
ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన వైసీపీ బాస్
అమరావతి – ఏపీ మాజీ చీఫ్ , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం వైసీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన కీలక సమావేశంలో జగన్ రెడ్డి ప్రసంగించారు.
రెడ్ బుక్ పెట్టడం పెద్ద పని కాదని కానీ ఇక నుంచి మనం గుడ్ బుక్ పెడదామని ప్రకటించారు. ఏపీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంపై అధికారంలో ఉన్న పార్టీ వేధింపులకు పాల్పడుతుందని, దానిని గట్టిగా ఎదుర్కోవాలని అన్నారు. మీకందరికీ తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటి పైకి తీసుకు రావాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయని. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారని గుర్తు పెట్టుకోవాలని అన్నారు .
మంచిగా పని చేసిన వాళ్ల పేర్లని ఆ గుడ్ బుక్‌లో రాసుకుని అధికారంలోకి వచ్చాక ప్రమోషన్ ఇద్దామని అన్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో కోర్టు మెట్టి కాయలు వేసినా టీడీపీ నేతలకు బుద్ది రాలేదన్నారు. ఇప్పుడు విజయవాడ వరద బాధితుల సాయాన్ని అడ్డంగా బొక్కేసి నీతులు వళ్లిస్తే ఎలా అని ప్రశ్నించారు.