NEWSTELANGANA

బాలగోపాల్ ఆశయాలను కొనసాగిస్తాం – చెన్న‌య్య‌

Share it with your family & friends

ఘ‌నంగా నివాళులు అర్పించిన నేత‌లు

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా – ప్ర‌ముఖ మేధావి, దివంగ‌త హ‌క్కుల నేత డాక్ట‌ర్ కందాల బాల గోపాల్ ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ బ‌హుజ‌న స‌మితి నేత ఆలూరి చెన్న‌య్య‌. బుధ‌వారం పాల‌మూరు ప‌ట్ట‌ణంలోని తెలంగాణ చౌర‌స్తాలో బాల గోపాల్ చిత్ర ప‌టాన్ని ఏర్పాటు చేసి..పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

త‌న జీవితాంతం పేద‌ల హ‌క్కుల కోసం పోరాడార‌ని కొనియాడారు. మాన‌వ హ‌క్కుల వేదికను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా కొన ఊపిరి ఉన్నంత వ‌ర‌కు పేద‌లు, సామాన్యుల కోసం త‌న గొంతు వినిపించార‌ని స్ప‌ష్టం చేశారు ఆలూరి చెన్న‌య్య‌. బాల‌గోపాల్ భౌతికంగా లేక పోయినా ఆయ‌న ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు, ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ప‌డిన త‌ప‌న ఎల్ల‌ప్ప‌టికీ శాశ్వ‌తంగా నిలిచే ఉంటుంద‌న్నారు.

అణ‌గారిన వ‌ర్గాల‌కు, పీడిత ప్రజల కోసం త‌న జీవితాన్ని అర్పించిన గొప్ప మాన‌వుడు డాక్ట‌ర్ కందాల బాల గోపాల్ అని కొనియాడారు. మ‌నుషులంతా ఒక్క‌టేన‌ని ప్ర‌త్యేకించి మ‌నుషుల మ‌ధ్య అంత‌రాలు ఉండ కూడ‌ద‌ని, స‌మాన‌త్వం, మాన‌వ‌త్వ‌మే మ‌న ఎజెండా కావాల‌ని చివ‌రి దాకా ఆచ‌రించి చూపించిన ప్ర‌జా మేధావి, అరుదైన నాయ‌కుడు బాల గోపాల్ అని పేర్కొన్నారు కృష్ణ ముదిరాజ్.

ఈ కార్య‌క్ర‌మంలో పండగ సాయన్న సామాజిక సేవా సమితి, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు శివన్న , పాలమూరు లేబర్ సంఘం అధ్యక్షులు గడ్డమీది గోపాల్, బండారి చెన్నయ్య, బి వెంకటేశ్వర్లు, అనుప జంగన్న, వంట కార్మికుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎల్ పెంటయ్య, కళాకారుల సంఘం అధ్య‌క్షుడు బాలచందర్, పద్మ నరేష్, బషీర్, భారత్ ట్రావెల్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ నాయకులు సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు.