దిగ్గజాన్ని కోల్పోయిన దేశం – ఎంకే స్టాలిన్
వ్యాపారానికి విలువలు నేర్పిన మానవుడు
తమిళనాడు – భారత దేశం గర్వించ దగిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కొనియాడారు. ఆయన మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. గురువారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసినా ఎక్కడ కూడా విలువలను కోల్పోలేదని కొనియాడారు ఎంకే స్టాలిన్. భారత దేశ పారిశ్రామిక రంగంలో చెరపలేని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన ఏది చెప్పారో అది ఆచరించి చూపించారని , రతన్ టాటా లేరన్న వార్త తనను కలిచి వేసిందని వాపోయారు సీఎం.
ఆయన దయ కలిగిన మానవుడని కొనియాడారు. రతన్ టాటా తనతో కలిసినప్పుడు ఆయన ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. రతన్ టాటా వ్యక్తి కాదు వ్యవస్థ అని పేర్కొన్నారు సీఎం. వినయం, కరుణ, దయ, పది మందికి మంచి చేయాలన్న సంకల్పం కలిగిన గొప్ప మానవుడు రతన్ టాటా అని ప్రశంసలు కురిపించారు. ఈ దేశం గొప్ప పారిశ్రామికవేత్తనే కాదు సహృదయత నిండిన మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని వాపోయారు ఎంకే స్టాలిన్.
అతని దూరదృష్టితో కూడిన నాయకత్వం టాటా గ్రూప్‌ను టాప్ లో నిలిచేలా చేయడమే కాకుండా నైతిక వ్యాపార పద్ధతులకు ప్రపంచ ప్రమాణాన్ని కూడా నెలకొల్పిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సీఎం.