రతన్ టాటాకు మరణం లేదు – కేటీఆర్
లోకం ఉన్నంత దాకా హృదయాల్లో ఉంటారు
హైదరాబాద్ – భారత దేశ దిగ్గజ పారిశ్రామిక వేత్త ఇక లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రతన్ టాటా జీవితం కోట్లాది మందికి స్పూర్తిని కలిగిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాపారవేత్తనే కాదు అత్యున్నతమైన మానవుడు అని కొనియాడారు. ఇవాళ టి హెబ్ ఏర్పాటు కావడంలో రతన్ టాటా కీలకమైన పాత్ర పోషించారని ప్రశంసించారు కేటీఆర్.
ఆయనతో పలు సందర్భాలలో కలుసు కోవడం, వివిధ అంశాలపై చర్చించడం తాను జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. ఆయన వ్యక్తి కాదు శక్తి అని అన్నారు కేటీఆర్. నిజమైన ఆవిష్కర్త, అద్భుతమైన మానవుడు, అనేక మందికి ప్రేరణ కలిగించారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంతగా సంపాదించినా వినయ పూర్వకంగా ఎలా ఉండాలో , ఎలా జీవించాలో కూడా విలువలు నేర్పించారని తెలిపారు. రతన్ టాటా మరణం వ్యాపార, దాతృత్వం, మానవత్వ ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాము టీ హబ్ ను చూసిన ప్రతీసారి మీరు గుర్తుకు వస్తారని అన్నారు కేటీఆర్. మీరు మా అందరి హృదయాలలో ఎల్లప్పటికీ ఉంటారని, ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి కలిగిస్తారని పేర్కొన్నారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు కేటీఆర్.