ఓటు కీలకం ప్రజాస్వామ్యానికి బలం
సీనియర్ అధికారిణి స్మితా సబర్వాల్
హైదరాబాద్ – జాతీయ ఓటరు దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , ప్రస్తుత తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఓటరు దినోత్సవంద సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలని పిలుపునిచ్చారు స్మితా సబర్వాల్. అభ్యర్థుల గెలుపు అవకాశాలను కేవలం ఓటు మాత్రమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తమకు నచ్చిన వారికి, తమ కోసం పని చేసే వారికి విలువైన ఓటు వేయాలని సూచించారు.
ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసే ఛాన్స్ వస్తుందని ఆలోచించ వద్దని స్పష్టం చేశారు స్మితా సబర్వాల్. స్థానిక సంస్థల్లో, లోక్ సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు ఓటు వేసే అవకాశం కలుగుతుందని, దానిని సక్రమంగా వినియోగించు కోవాలని కోరారు .
ఓటు విలువైనదే కాదు పవిత్రమైనదని, అత్యంత గొప్పనైన ఆయుధమని, దానిని సక్రమంగా వాడుకుంటే బతుకు బాగు పడుతుందని, దేశం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.