రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు
తీవ్ర సంతాపం తెలిపిన వైఎస్ జగన్ రెడ్డి
తాడేపల్లి గూడెం – భారత దేశం గర్వించ దగిన మానవుడు , అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని , ఆయన మృతి యావత్ దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రతన్ నావల్ టాటా మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు
ఆయనను దూరదృష్టి గల నాయకుడిగా, భారతీయ పరిశ్రమకు నిజమైన ఐకాన్‌గా అభివర్ణించారు.
సమగ్రత, ఆవిష్కరణలు, దాతృత్వం పట్ల రతన్ నావల్ టాటా అచంచలమైన నిబద్ధతను చివరి దాకా కలిగి ఉండడం గొప్ప విషయమని ప్రశంసించారు . రతన్ టాటా ఎన్నో సంస్థలను స్థాపించారు. మరికొన్నింటిని నిలబెట్టారు. ఈ దేశంలోనే అత్యున్నతమైన పరిశ్రమలుగా తీర్చి దిద్దిన ఘనత రతన్ నావల్ టాటాదేనని పేర్కొన్నారు.
రతన్ టాటా వ్యక్తి కాదు వ్యవస్థ. వ్యాపారానికి విలువలు ఉండాలని స్పష్టం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఏది చెప్పారో అది ఆచరణలో ఉండేలా చూశారని, కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని ప్రశంసించారు.
ఆయన జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయమని, కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయని తెలిపారు జగన్ రెడ్డి. ఈ విషాద సమయంలో టాటా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ఆకాంక్షించారు వైసీపీ అధ్యక్షుడు.