దేశం గర్వించ దగిన వ్యక్తి రతన్ టాటా
తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాహుల్
ఢిల్లీ – ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. “రతన్ టాటా ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయన వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ శాశ్వతమైన ముద్ర వేశారు. అతని కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు.
రతన్ టాటాకు మరణం లేదు. ఆయన మహోన్నత మానవుడు. కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు రాహుల్ గాంధీ. చరిత్ర ఉన్నంత కాలం రతన్ జీ బతికే ఉంటారని స్పష్టం చేశారు.
రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. దాతృత్వ పరంగా , సామాజిక పరంగా, పారిశ్రామిక పరంగా. రతన్ నావల్ టాటా డిసెంబర్ 28, 1937లో పుట్టారు. ఆయనకు 86 ఏళ్‌లు. పరోపకారిగా ఎక్కువగా గుర్తింపు పొందారు. వేల కోట్లను దానం చేశారు.
1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్, టాటా సన్స్‌కు చైర్మన్‌గా పని చేశాడు, అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అత్యున్న పురస్కారాలు అందుకున్నాడు.
జంషడీ టాటా రతన్ టాటాను దత్తత తీసుకున్నాడు. చివరి వరకు బ్రహ్మచారిగానే ఉన్నాడు రతన్ టాటా. పలు సంస్థలను నెలకొల్పాడు. 30కి పైగా స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టాడు రతన్ టాటా. టాటా గ్రూప్ సంస్థలను 2012 వరకు నడిపాడు. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీని స్థాపించాడు. 2004లో టీసీఎస్ ను తీసుకున్నాడు.
2004లో దిగ్గజ బ్రిటీష్ కార్ బ్రాండ్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ లను కొనుగోలు చేశారు. 2009లో రతన్ టాటా ప్రపంచంలోనే అత్యంత చవకనైన నానా కారును తీసుకు వచ్చారు. భారత దేశం గర్వించ దగిన ప్రముఖులలో ఒకరు రతన్ నావల్ టాటా.