మిత్రమా నీ నష్టాన్ని భరించడం కష్టం
ప్రముఖ నటి..రచయిత్రి సిమి గరేవాల్
ముంబై – ప్రముఖ నటి , దివంగత రతన్ టాటా స్నేహితురాలిగా పేరు పొందిన సిమీ గరేవాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అప్పట్లో వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదన్న ప్రచారం ఉంది. కానీ చని పోయేంత వరకు రతన్ టాటా బ్రహ్మచారిగానే ఉన్నారు. ఆయన మరణం తనను మరింత బాధకు గురి చేసిందని వాపోయారు సిమి గరేవాల్.
గురువారం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించింది. “మీరు వెళ్ళారని వారు అంటున్నారు. నీ నష్టాన్ని భరించడం చాలా కష్టం… చాలా కష్టం… వీడ్కోలు మిత్రమా.”
అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది సిమి గరేవాల్. జీవితంలో అన్నింటి కంటే స్నేహం గొప్పది. గొప్ప మానవుడిని దేశం కోల్పోయిందని పేర్కొంది.
రతన్ టాటాకు మరణం లేదు. ఆయన మహోన్నత మానవుడు. కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. చరిత్ర ఉన్నంత కాలం రతన్ జీ బతికే ఉంటారని స్పష్టం చేశారు.
రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. దాతృత్వ పరంగా , సామాజిక పరంగా, పారిశ్రామిక పరంగా. రతన్ నావల్ టాటా డిసెంబర్ 28, 1937లో పుట్టారు. ఆయనకు 86 ఏళ్‌లు. పరోపకారిగా ఎక్కువగా గుర్తింపు పొందారు. వేల కోట్లను దానం చేశారు.