రతన్ టాటా..మీకు మరణం లేదు – అనుష్క శర్మ
కోట్లాది ప్రజల జీవితాలను మార్చిన గొప్ప వ్యక్తి
ముంబై – ప్రముఖ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రతన్ టాటా లేరన్న వార్తను నమ్మలేక పోతున్నానని అన్నారు. రతన్ టాటా విషాద వార్తతో చాలా బాధపడ్డానని తెలిపారు. రతన్ టాటా వ్యక్తి కాదు ఓ వ్యవస్థ. దాణ గుణం కలిగి ఉండడం చాలా అరుదు. కోట్లాది రూపాయలను ఆయన ఉచితంగా పంచి పెట్టారు. ఆయన మరణం తనను మరింత విషాదానికి గురి చేసిందని వాపోయింది అనుష్క శర్మ.
ప్రతిదాని ద్వారా సమగ్రత, దయ, గౌరవం , విలువలను సమర్థించాడు. ఏనాడూ వ్యాపార దృక్ఫథంతో సంస్థలను నడిపించ లేదు. ఇదే రతన్ టాటాకు ఉన్న గొప్ప గుణం. ఆయన భారత దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని తన దాతృత్వంతో, సేవా గుణంతో విస్తు పోయేలా చేశారు.
రతన్ నావల్ టాటా మరణం తనకే యావత్ భారత దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ దేశం గర్వించ దగిన మానవుడు. తాజ్ ఎల్లప్పటికీ నిలిచే ఉంటుంది. టైటాన్ ఓ ఐకాన్. అది మనల్ని అంటి పెట్టుకునే ఉంటుందని అన్నారు.
రతన్ టాటాకు మరణం లేదు. ఆయన మహోన్నత మానవుడు. కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. చరిత్ర ఉన్నంత కాలం రతన్ జీ బతికే ఉంటారని స్పష్టం చేశారు.