రతన్ టాటా కోసం కచేరి నిలిపివేత – దిల్జీత్
ప్రకటించిన పంజాబీ సూపర్ సింగర్
ముంబై – ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కీలక ప్రకటన చేశాడు. భారత దేశం గర్వించ దగిన పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. తనపై టాటా ప్రభావం ఎంతో ఉందన్నారు. ఆయనకు ఘనంగా తుది నివాళి అర్పించేందుకు తాను జర్మనీలో నిర్వహించాల్సిన కచేరిని క్యాన్సిల్ చేసుకున్నానని వెల్లడించారు గాయకుడు.
ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా వీడియో సందేశం పోస్ట్ చేశారు దిల్జిత్ దోసాంజ్. తాను నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. ఆయనను కలుసుకునే అవకాశం రాలేదని, కానీ రతన్ టాటా అనుసరించిన విలువలు, దాతృత్వం, దయా గుణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని స్పష్టం చేశారు .
ఆయన పారిశ్రామికవేత్తనే కాదు మహోన్నత మానవుడు అంటూ కొనియాడారు దిల్జీత్ దోసాంజ్. ఆయనకు గౌరవ సూచకంగా తాను కచేరినీ నిలిపి వేసినట్లు వెల్లడించారు.
“రతన్ టాటా గురించి మీ అందరికీ తెలుసు. ఆయన కన్నుమూశారు. ఆయనకు ఇదే నా చిన్న నివాళి. ఈ రోజు, అతని పేరు తీసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే అతని జీవితంలో ఎల్లప్పుడూ కష్టపడి పనిచేశాడు. నేను అతని గురించి ఏమి విన్నా, చదివినా ఏ ఒక్కరు రతన్ టాటా గురించి పల్లెత్తు మాట వ్యతిరేకంగా మాట్లాడ లేదన్నారు దిల్జీత్ దోసాంజ్.