నా వ్యక్తిగత హీరో రతన్ టాటా – కమల్ హాసన్
ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా
తమిళనాడు – రతన్ టాటా మరణం తనను మరింత బాధకు గురి చేసిందని పేర్కొన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. గురువారం ఎక్స్ వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి రతన్ టాటా అని పేర్కొన్నారు.
నా పరంగా వ్యక్తిగతంగా తనకు హీరో ఆయనేనని తెలిపారు. తాను ఇప్పటి వరకు రతన్ టాటా జీవితాన్ని పరిశీలిస్తూ వచ్చానని అన్నారు కమల్ హాసన్. విచిత్రం ఏమిటంటే ఆయనను అనుసరించేందుకు తాను ప్రయత్నం చేశానని తెలిపారు.
రతన్ టాటా వ్యక్తి కాదు ఓ వ్యవస్థ. ఆధునిక భారతదేశ దేశ కథలో ఎప్పటికీ నిలిచి పోయే జాతీయ సంపద అని కొనియాడారు.
రతన్ టాటా నిజమైన సంపద భౌతిక సంపదలో కాదు, నీతి, సమగ్రత, వినయం, దేశభక్తిలో ఉందన్నారు. 2008 ముంబయి దాడుల తర్వాత, ఐకానిక్ తాజ్ హోటల్‌లో బస చేస్తున్నప్పుడు నేను అతనిని కలిశానని గుర్తు చేసుకున్నారు.. జాతీయ సంక్షోభం నెలకొన్న ఆ తరుణంలో ఓ గోడ లాగా నిలబడ్డాడని పేర్కొన్నారు కమల్ హాసన్.
రతన్ టాటా భారతీయ ఆత్మ అని , ఆయన చెరపలేని ముద్ర వేశారని, కోట్లాది మందిని ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చేశారని కొనియాడారు . ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని, రతన్ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.