పూడ్చ లేని అగాధం అంతులేని విషాదం
రతన్ టాటా సహాయకుడు శంతను నాయుడు
ముంబై – రతన్ టాటా కన్ను మూయడంతో ఆయనతో సుదీర్ఘ ప్రయాణం చేసిన శంతను నాయుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రముఖ సామాజిక వేదిక లింక్డ్ ఇన్ లో తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. వీడ్కోలు..మై డియర్ లైట్ హౌస్ అంటూ పేర్కొన్నాడు. శంతను నాయుడు రతన్ టాటా ఆఫీసులో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.
కోట్లాది విలువ చేసే సంస్థలకు చెందిన రతన్ టాటాకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడ శంతను నాయుడు. ఇదిలా ఉండగా తను కార్నెల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చదివాడు. గుడ్ ఫెలోస్ పేరుతో స్టార్టప్ ను ఏర్పాటు చేశారు. ఇది ఎంతగానో నచ్చింది రతన్ టాటాకు.
రతన్ టాటా తన నుండి వేరు కావడంతో తట్టుకోలేక భావోద్వేగానికి లోనయ్యాడు శంతను నాయుడు. “ఈ స్నేహం ఇప్పుడు నాకు మిగిల్చిన రంధ్రం, నేను నా శేష జీవితాన్ని పూరించడానికి ప్రయత్నిస్తాను. దుఃఖమే ధర. ప్రేమ కోసం చెల్లించడానికి.”
ప్రస్తుతం శంతను నాయుడుకు 28 ఏళ్లు. కుక్కల పట్ల పరస్పర ప్రేమ, శ్రద్ధ వీరిద్దరి మధ్య బంధాన్ని కొనసాగేలా చేసింది.