DEVOTIONAL

రేపే చ‌క్ర‌స్నానం..ఏర్పాట్ల‌పై స‌మీక్ష

Share it with your family & friends

భ‌క్తులు సంయ‌మ‌నంతో స్నానం చేయాలి
తిరుమ‌ల – శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన అక్టోబరు 12 శ‌నివారం రోజున చ‌క్ర‌స్నానం ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ స్వామి వారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల స్వామి పుష్క‌రిణిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారికి, శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆ త‌రువాత చ‌క్ర‌స్నానం నిర్వహిస్తారన్నారు.

ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, స్నాన ఘట్టాలు పై సమీక్షించారు. భ‌ద్ర‌తా ప‌రంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బందితోపా టు ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్ డఆర్ఎఫ్, గజ ఈత‌గాళ్ల‌ను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భక్తులకు విజ్ఞప్తి

చక్రస్నానం ప‌విత్ర‌త రోజంతా ఉంటుంద‌ని, భ‌క్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాల‌ని ఆయన కోరారు. భ‌క్తులు దుస్తులు మార్చు కునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

ఈ స‌మావేశంలో జె ఈ ఓ లు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్ ఓ శ్రీధర్ సిఇ సత్యనారాయణ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.