టెన్నిస్ దిగ్గజం రిటైర్మెంట్ కు సిద్దం
సంచలన ప్రకటన చేసిన రఫెల్ నాదల్
హైదరాబాద్ – ప్రపంచ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ సంచలన ప్రకటన చేశారు. 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా అరుదైన చరిత్ర సృష్టించాడు. ఇక తాను త్వరలోనే నిష్క్రమిస్తున్నట్లు స్పష్టం చేశాడు. దీని కోసం ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలిపారు. డేవిస్ కప్ తర్వాత ఇక తాను టెన్నిస్ క్రీడా రంగం నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు రఫెల్ నాదల్.
ఎప్పుడో ఒకప్పుడు వీడాల్సిందే. కానీ బాధగా ఉందన్నాడు. ఈ స్థాయికి రావడానికి ఎంతో ఇబ్బందులు పడ్డాను. సహకరించిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని అన్నాడు రఫెల్ నాదల్. వచ్చే నెల నవంబర్ 8న స్పెయిన్ లో జరగనున్న డేవిస్ కప్ చివరిది అవుతుందని తెలిపాడు.
ఇప్పటి వరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించాడు. వీటిలో ఎక్కువగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుపొందడం విశేషం.
రఫెల్ నాదల్ టెన్నిస్ రంగంలో దిగ్జజం . తను ఇప్పటికి మొత్తం 92 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లను కలిగి ఉన్నాడు. ఇందులో 36 మాస్టర్స్ టైటిళ్లతో పాటు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా ఉంది. ఇదిలా ఉండగా సింగిల్స్ లో గోల్డెన్ సామ్ ను పూర్తి చేసిన ముగ్గురిలో తను ఒకడు . ఇది ఓ రికార్డు.
ఈ సందర్బంగా రఫెల్ నాదల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది అత్యంత కష్టమైన నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టింది. కానీ జీవితంలో ప్రతి దానికీ ప్రారంభంతో పాటు ముగింపు కూడా ఉంటుందని పేర్కొన్నాడు.