ఆర్ఎస్పీపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఆయనకు ఏమైందో అర్థం కావడం లేదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్పీ మా జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు మంచి పేరుంది. కానీ ఈ మధ్యన ఆయనకు ఏమైందో అర్థం కావడం లేదన్నారు సీఎం .
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉందన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తనకు అభ్యంతరం లేదన్నారు రేవంత్ రెడ్డి.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పు పడుతున్నారంటూ ప్రశ్నించారు.
ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో… ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా..అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా పరంగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.