దరఖాస్తుల ద్వారానే 1700 కోట్ల ఆదాయం
మద్యం షాప్ లకు భారీగా దరఖాస్తులు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని రీతిలో విస్తు పోయేలా భారీ ఎత్తున మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. ఇవాల్టితో మద్యం షాపుల కోసం అక్టోబర్ 11న తుది గడువు విధించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసేందుకు పోటీ పడ్డారు.
ఇవాల్టితో రాష్ట్రంలో ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పూర్తయింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందు కోసం 85 వేలపై పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది.
మద్యం దరఖాస్తుల ద్వారా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1700 కోట్లకు పైగా ఆదాయం రావడం విశేషం. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు ఏకంగా 5,704 దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయి.
కాగా దసరా, దీపావళి పండగుల సందర్భంగా మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు పెంచాలని కోరారు. కానీ ఒకే ఒక్క రోజు మాత్రమే పెంచింది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారీ ఎత్తున వర్షాల కారణంగా ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మద్యం దుకాణాలకు ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం తో సర్కార్ కు ఊరటనిచ్చేలా చేసింది.