గండం గడించింది ఫ్లైట్ దిగింది
రెండున్నర గంటలకు పైగా గాల్లోనే
తిరుచ్చి – ఎట్టకేలకు ఎయిర్ ఇండియా సేఫ్ గా దిగింది. శుక్రవారం ఏకంగా రెండున్నర గంటలకు పైగా గాల్లోనే విమానం సురక్షితంగా దిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 141 మంది ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గాల్లోనే చక్కర్లు కొడుతూనే ఉంది. దీంతో అందులో ఉన్న వారంతా ఏం జరుగుతుందో తెలియక తల్లడిల్లి పోయారు. ఇది ఊహించని పరిణామం. గాల్లోనే తిరుగుతుండడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించాడు పైలట్.
విచిత్రం ఏమిటంటే టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదిలా ఉండగా విమానంలోని హైడ్రాలిక్ సిస్టంలో లోపం ఉన్నట్లు గుర్తించాడు పైలట్. చివరకు ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరికి లోనయ్యారు. చివరకు సేఫ్ గా విమానాన్ని దించాడు పైలట్.
అంతకు ముందు తిరుచ్చి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు.