సీఎం కామెంట్స్ ఆర్ఎస్పీ సీరియస్
రేవంత్ రెడ్డికి ఇది తగదని ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇవాళ షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో జరిగిన బహిరంగ సభలో ప్రత్యేకించి తనను ఉద్దేశించి కించ పరిచేలా కామెంట్స్ చేయడాన్ని తప్పు పట్టారు. అంతే కాకుండా మాజీ సీఎం కేసీఆర్ విద్యా రంగాన్ని పట్టించు కోలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన స్థాయికి తగ్గినట్టుగా లేవన్నారు. ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆరోపించారు.
కేసీఆర్ ఎస్సీ, ఎస్టీలను గొర్రెలు, బర్రెలకు పరిమితం చేశాడని మీరు నింద వేయడం దారుణంగా ఉందన్నారు ఆర్ఎస్పీ. మీరు చేసిన ఆరోపణలు, నిందలు, విమర్శలకు అక్టోబర్ 12న శనివారం మీడియా సాక్షిగా అన్నీ బహిర్గతం చేస్తానని ప్రకటించారు.
ముందు మీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల నుండి ముగ్గురు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తైవాన్ ఇంటర్నేషనల్ టోర్నీకి సెలక్టు అయ్యారని, వాళ్ల చార్జీలకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తలేరంట మీ అధికారులని ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముందు వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు .