దుర్గా పూజలో నటి కాజోల్ ఫైర్
సోషల్ మీడియాలో వైరల్
ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కు కాజోల్ తో పాటు బాలీవుడ్ కు చెందిన అలియా భట్, రాణి ముఖర్జీ, అజయ్ దేవగన్ లతో పాటు సినీ రంగానికి చెందిన ఇతర సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా కాజోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గా మాతను పూజించే సమయంలో కొందరు బూట్లు ధరించి రావడాన్ని గమనించారు. దీనిపై అభ్యంతరం తెలిపారు. పవిత్రమైన పూజా కార్యక్రమంలో ఇలా షూస్ ధరించి ఎలా వస్తారంటూ ప్రశ్నించింది. చాలా మందిని నిలదీసింది.
పూజ పట్ల గౌరవం, ప్రేమ కలిగి ఉండాలని ఇది భారతీయ సంస్కృతిలో భాగమని, దీనిని గుర్తించక పోతే ఎలా అని ప్రశ్నించింది. సీరియస్ అయ్యింది కాజోల్. కొంత గౌరవం కలిగి ఉండండి, ఇది పూజ అని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా వేడుకల మధ్య నటి అలియా భట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అద్భుతమైన ఎరుపు చీరలో కనిపించింది. ఆమె సోదరి షహీన్ భట్ కూడా సంప్రదాయపు దుస్తుల్లో ఆకట్టుకుంది. మొత్తంగా పండుగ వాతావరణం నెలకొంది.