జగన్మాత ఆశీస్సులు అందరికీ ఉండాలి
విజయ దశమి పండుగ శుభాకాంక్షలు
అమరావతి– విజయ దశమి పండుగ సందర్బంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. దసరాను పురస్కరించుకుని దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలంతా బాగుండాలని కోరారు.
ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని అమ్మ వారిని వేడుకుంటున్నానని పేర్కొన్నారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు అనిత వంగలపూడి.
దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశమన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు హోం శాఖ మంత్రి.
శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మ వారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించు కున్నామని తెలిపారు. మరో వైపు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు వంగలపూడి అనిత.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున విజయ దశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు.