దుర్గాష్టమి..బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
టీజీపీడబ్ల్యూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – విజయ దశమి పండుగ సందర్బంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గిగ్ అండ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్.
శక్తి స్వరూపిణి, సర్వ శుభకారిణి దుర్గా మాత ఆశీస్సులతో మీరు తలపెట్టే ప్రతీ కార్యం విజయవంతం అవ్వాలని ,తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు
దసరాను పురస్కరించుకుని దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలంతా బాగుండాలని కోరారు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని అమ్మ వారిని వేడుకుంటున్నానని పేర్కొన్నారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు షేక్ సలావుద్దీన్.
దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశమన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
దేశ వ్యాప్తంగా పని చేస్తున్న గ్రిగ్స్ అండ్ వర్కర్స్ అందరికీ పేరు పేరునా దసరా, బతుకమ్మ పండగుల సందర్బంగా గ్రీటింగ్స్ తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు షేక్ సలావుద్దీన్.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున విజయ దశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు .