NATIONALNEWS

వెంక‌య్య‌..చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్

Share it with your family & friends

ప్రక‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. తెలుగు, తెలంగాణ‌కు చెందిన వారిని కూడా ఎంపిక చేసింది. వీరిలో ఏపీకి చెందిన మాజీ ఉప రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడుతో పాటు ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వీరితో పాటు వైజ‌యంతి మాల బాలి, మ‌ర‌ణాంత‌రం బిందేశ్వ‌ర్ పాఠ‌క్ , ప‌ద్మా సుబ్ర‌మ‌ణ్యంల‌కు కూడా ద‌క్కింది.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన రామ్ నాయ‌క్ , గాయ‌ని ఉషా ఉతుప్ , మ‌ర‌ణాంత‌రం న‌టుడు విజ‌య‌కాంత్ తో స‌హా 17 మందికి ప‌ద్మ భూష‌ణ్ అవార్డు ల‌భించింది. వీరితో పాటు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మ‌ర‌ణాంత‌రం బీవీ ఎం. ఫాతిమా, ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, బాంబే స‌మాచార్ య‌జ‌మాని హార్కుస్ ఎన్ కామా కు కూడా ప‌ద్మభూష‌ణ్ అవార్డు ద‌క్కింది.

వీరితో పాటు ప‌ద్మ అవార్డులు ద‌క్కించుకున్న వారిలో తెలంగాణ‌కు చెందిన నారాయ‌ణ‌పేట జిల్లా దామ‌ర‌గిద్ద‌కు చెందిన బుర్ర‌వీణ వాయిద్య కారుడు దాస‌రి కొండ‌ప్ప‌, జ‌న‌గామ‌కు చెందిన యక్ష‌గాన క‌ళాకారుడు గ‌డ్డం స‌మ్మ‌య్య‌, వేలు ఆనంద‌చారి, కేథావ‌త్ సోమ్ లాల్ , కూరెళ్ల విఠలాచార్య‌ల‌ను ఎంపిక చేసింది.