రైలు ప్రమాదం బాధాకరం – మోడీ
మృతుల కుటుంబాలకు సంతాపం
ఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ రైలు ప్రమాదం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తాజాగా మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం బాలాసోర్ ప్రమాదం జరగడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పీఎం. ప్యాసింజర్ రైలు నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం , ఈ ఘటనలో పలువురు గాయ పడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తీవ్రంగా గాయ పడిన వారికి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ప్రధానమంత్రి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలలో మునిగి పోయిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ప్రమాద ఘటన జరగడం తనను కలిచి వేసిందన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. ఘటన జరగడానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామన్నారు.