చాముండేశ్వరి దేవి ఆశీస్సులు ఉండాలి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య
కర్ణాటక – విజయ దశమి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దసరా పండుగ కన్నడ ప్రజలతో పాటు దేశ ప్రజందరికీ సకల సౌభాగ్యాలు కల్పించాలని మాతా చాముండేశ్వరి దేవిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సీఎం.
ఈ దుర్గాష్టమి సత్యం, న్యాయం, నిజమైన మతం విజయాన్ని తెలియ చేస్తుందని పేర్కొన్నారు. అబద్ధం, అన్యాయం, అధర్మానికి వ్యతిరేకంగా ధైర్యంగా మీ గొంతును పెంచడానికి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు సిద్దరామయ్య.
శాంతి, ప్రేమ, సామరస్య, సహజీవన వెలుగులు సర్వత్రా వ్యాపించాలని అమ్మ వారిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు కర్ణాటక సీఎం.
ఈ దసరా పండుగ మీ కుటుంబాలకు సకల శుభాలను చేకూర్చాలని, ఇంటింటా సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నానని తెలిపారు .
దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశమన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.