ఎస్సీ వర్గీకరణ పేరుతో రేవంత్ మోసం
నిప్పులు చెరిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ సీరియస్ కామెంట్స్ చేసింది. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అంశాన్ని ముందుకు కావాలనే తీసుకు వచ్చిందని ఆరోపించింది. ఇది కావాలనే తప్ప నిరుద్యోగులకు మేలు చేయాలని మాత్రం కాదని పేర్కొంది బీఆర్ఎస్.
ఇటీవల జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నించింది. కేవలం తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, నిలిపి వేసిన వాటినే భర్తీ చేస్తున్నారే తప్పా ఇప్పటి వరకు కొత్తగా జాబ్స్ ను భర్తీ చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
రేవంత్ సర్కారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నుంచి తప్పించు కునేందుకు స్కెచ్చే వేసిందని సంచలన ఆరోపణలు చేసింది. కొలువులు వెంట వెంటనే భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామంటూ యువత, నిరుద్యోగులను మోసం చేసిందని, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక పట్టించు కోవడం లేదని మండిపడింది బీఆర్ఎస్.
వర్గీకరణ పేరుతో మరో ఆరు నెలల పాటు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రావలని తేలి పోయిందని తెలిపింది.