వెంకయ్యకు దక్కిన గౌరవం
కేంద్రం అత్యున్నత పురస్కారం
అమరావతి – దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు అత్యున్నతమైన పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. ఆయనతో పాటు చిరంజీవిని కూడా వరించింది. చిన్నప్పటి నుంచి ఆర్ఎఎస్ , ఏబీవీపీ, బీజేపీలో అంచెలంచెలుగా పని చేస్తూ అత్యున్నతమైన స్థానానికి చేరుకున్నారు. నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు.
ఎమ్మెల్యేగా ఆనాటి అసెంబ్లీలో దివంగత జైపాల్ రెడ్డితో కలిసి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ విషయం పైన నైనా అనర్ఘలంగా మాట్లాడే అరుదైన నేతల్లో వెంకయ్య నాయుడు ఒకరు.
మంచి వక్తనే కాదు అద్భుతమైన రచయిత కూడా. తను అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడిన వాటితో కలిపి పుస్తకాలుగా తీసుకు వచ్చారు. బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్నారు. ఈ దేశంలో ఆ పార్టీని విజయ పథంలోకి తీసుకు రావడంలో చోదక శక్తిగా పని చేశారు వెంకయ్య నాయుడు.
అందరికీ ఇష్టమైన వ్యక్తిగా, అజాత శత్రువుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించారు. వాటికి వన్నె తెచ్చేలా చేశారు. కేంద్ర మంత్రిగా సక్సెస్ అయ్యారు. దేశంలోనే అత్యున్నతమైన రెండో పురస్కారానికి కేంద్రం ఎంపిక చేయడం విశేషం. వెంకయ్య వయస్సు 75 ఏళ్లు. 46 ఏళ్ల రాజకీయ జీవితం. ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ఉప రాష్ట్రపతిగా ఇలా ప్రతి పదవిని వరించింది.