NEWSANDHRA PRADESH

అత్యాచ‌ర ఘ‌ట‌న‌పై హోం మంత్రి సీరియ‌స్

Share it with your family & friends

స‌త్వ‌ర‌మే అరెస్ట్ చేయాల‌ని అనిత ఆదేశం

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి సీరియ‌స్ అయ్యారు. శ్రీ స‌త్య సాయి జిల్లా చిల‌మ‌త్తూరు న‌ల్ల‌బొమ్మ‌నిప‌ల్లిలో అత్తా కోడ‌లిపై సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు.

ఈ మేర‌కు ఘ‌ట‌న‌కు సంబంధించి బాధ్యులైన వారిని వెంట‌నే ప‌ట్టుకుని అరెస్ట్ చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఎస్పీని ఆదేశించారు.

అత్యాచార ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు అనిత వంగ‌ల‌పూడి. ఈ సంద‌ర్బంగా జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించి..దర్యాప్తు చేపట్టినట్లు హోంమంత్రికి వివరించారు ఎస్పీ. దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు నాలుగు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు . వారంతా గాలిస్తున్నామ‌ని అనిత వంగ‌ల‌పూడికి వెల్ల‌డించారు.

బాధిత మహిళలకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఎస్పీ ర‌త్న‌ను ఆదేశించారు అనిత వంగ‌ల‌పూడి.