తపోవనం ఆశ్రమంలో అనిత
స్వామీజీ ఆశీస్సులు పొందిన
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి శనివారం తుని మండలం కుమ్మరిలోవలో ఉన్న తపోవనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఇవాళ విజయ దశమి పండుగ. ఈ సందర్బంగా ప్రతి ఏటా ఈ ఆశ్రమాన్ని సందర్శించడం , స్వామీజీ ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోంది.
ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్బంగా సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆశీర్వచనం అందించారు హోం శాఖ మంత్రికి.
వంగలపూడి అనితతో పాటు కుటుంబం సైతం ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంది. జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ. విజయ దశమిని పండుగ సందర్బంగా తపోవనం ఆశ్రమంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టారు . వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు స్వామీజీ ఆశీర్వచనం , ఫల ప్రసాదాలు అందించారు.