అత్యాచార ఘటన బాధాకరం – జగన్
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం
అమరావతి – ఏపీ మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వేళ హిందూపురంలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ జరగడం పట్ల స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, తనను కలిచి వేసిందని పేర్కొన్నారు.
శనివారం వైఎస్ జగన్ రెడ్డి ట్వి్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టనకరమని పేర్కొన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం.
తాను చిత్తూరు జిల్లాలో బాలిక హత్యపై పరామర్శించేందుకు వెళతానని ప్రకటించగానే హడావుడిగా కూటమి మంత్రులు వెళ్ళారని అన్నారు. చిలమత్తూరు గ్యాంగ్‌రేప్ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, అనంతపురం జిల్లా మంత్రి సవిత, హోంమంత్రి అనిత వంగలపూడి ఎందుకు పరామర్శించ లేదంటూ ప్రశ్నించారు జగన్ రెడ్డి. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అప్పటికప్పుడు హెలికాఫ్టర్‌లో ఉన్నతాధికారులను పంపిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందన్నారు,