సంజూ శాంసన్ సెన్సేషన్
హైదరాబాద్ వేదికపై సూపర్
హైదరాబాద్ – కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా దంచి కొట్టాడు. శాంసన్ ఆట దెబ్బకు బంగ్లాదేశ్ విల విల లాడారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ సాధించి ఔరా అనిపించేలా ఆడాడు.
ఓ వైపు సూర్య కుమార్ యాదవ్ కూడా బాగానే ఆడినప్పటికీ మైదానంలో సంజూ శాంసన్ ఆట ముందు చిన్న బోయింది. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 47 బంతులు ఎదుర్కొన్న సంజూ శాంసన్ 111 పరుగులు చేశాడు. 8 సిక్సర్లు 11 ఫోర్లు కొట్టాడు. టి20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ సాధించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 287 రన్స్ భారీ స్కోర్ సాధించింది. అనంతరం బిగ్ ఛాలెంజ్ ను స్వీకరించ లేక బంగ్లాదేశ్ 133 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ ను 3-0తో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది ఇండియా.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ భర్తీ చేశాడు. ప్రధానంగా కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ శాంసన్ వైపు మొగ్గు చూపాడు. శాంసన్ మూడు మ్యాచ్ లు ఆడాడు. తొలి మ్యాచ్ లో 29 రన్స్ చేయగా రెండో మ్యాచ్ లో కేవలం 10 పరుగులకే వెనుదిరిగాడు. కానీ మూడో కీలక మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సంజూ శాంసన్.