మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్
విజయ దశమి పండుగ రోజు
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారారు. విజయ దశమి పండుగ సందర్బంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా పండుగ అభినందనలు తెలిపారు కేసీఆర్.
ఈ సందర్బంగా తను ప్రాణ ప్రదంగా ప్రేమించే మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాంశురావు లేక పోవడం పట్ల ఆవేదన చెందారు. తాను ప్రస్తుతం అమెరికాలో చదువు కోసం ఉన్నానని, ఈ దుర్గాష్టమి పండుగ సమయంలో తను ప్రేమించే కేసీఆర్ తో పండుగ జరుపక పోవడం మిస్ అవుతున్నానని వాపోయాడు.
ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన తాతయ్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దసరా పండుగను ఘణంగా జరిపారు కేసీఆర్ కుటుంబంలో. కేటీఆర్ కూతురుతో పాటు కేటీఆర్ తన తండ్రితో సెల్ఫీ పోటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా..సెన్సేషన్ గా మారింది. ఇదిలా ఉండగా విజయ దశమి పండుగతో పాటు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.