ANDHRA PRADESHNEWS

చిరంజీవ సుఖీభ‌వ

Share it with your family & friends

మెగాస్టార్ కు అరుదైన గౌర‌వం

అమ‌రావ‌తి – ఏపీకి చెందిన ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యున్న‌త‌మైన పౌర పుర‌స్కారం ల‌భించింది. న‌టుడిగా ఆయ‌న సుప‌రిచితుడు. స్వ‌యంకృషితో పైకి వ‌చ్చారు. వ‌య‌సు మీద ప‌డినా ఇంకా చ‌లాకిగా, త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , మేన‌ల్లుడు అల్లు అర్జున్ తో పోటీ ప‌డి న‌టిస్తున్నారు.

ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌జారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. సీఎం అవుదామ‌ని అనుకున్నారు. కానీ అనుకోకుండా కాలేక పోయారు. తిరుప‌తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత త‌న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా (స్వ‌యం ప్ర‌తిప‌త్తి) ప‌ని చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మొగల్తూరు చిరంజీవి స్వ‌స్థ‌లం. ఆయ‌న వ‌య‌సు 68 ఏళ్లు. ఆగ‌స్టు 22 , 1955లో పుట్టారు. అంజ‌నాదేవి, వెంక‌ట్ రావు త‌ల్లిదండ్రులు. భార్య సురేఖ‌. త‌మ్ముళ్లు కూడా న‌టులే. నాగ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు న‌ట‌న‌తో పాటు జ‌న‌సేన పార్టీకి కీల‌కంగా ఉన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే జ‌గ‌న్ ను ఇంటికి పంపించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ పుర‌స్కారంతో చిరంజీవి అభిమానులు సంతోషంగా ఉన్నారు.