సంజూ శాంసన్ సూపర్ షో
గౌతమ్ గంభీర్..సూర్య యాదవ్
హైదరాబాద్ – భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హైదరాబాద్ లో జరిగిన టీ20 మ్యాచ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్ 8 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు. అద్బుతమైన ఇన్నింగ్స్ తో రికార్డ్ బ్రేక్ చేశాడు. భారత జట్టు పరంగా టి20 ఫార్మాట్ లో రెండో ఆటగాడు ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సంజూ శాంసన్ గుర్తింపు పొందాడు.
అంతకు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వేగవంతమైన శతకం చేశాడు. ప్రస్తుతం శాంసన్ వయసు 29 ఏళ్లు. గత కొంత కాలంగా భారత జట్టులో అడపా దడపా ఎంపికవుతూ వచ్చాడు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టి20 మ్యాచ్ లో దుమ్ము రేపాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే 40 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. బంగ్లాదేశ్ కు చెందిన రిషద్ హుస్సేన్ బౌలింగ్ లో 5 సిక్సర్లు బాదాడు. దెబ్బకు బంగ్లా ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఇదిలా ఉండగా సంజూ శాంసన్ ఐపీఎల్ లో ఆకట్టుకుంటూ వచ్చాడు సంజూ శాంసన్.