సమిష్టి జట్టుకు సంకేతం విజయం
స్పష్టం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
హైదరాబాద్ – టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ , బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి మూడో టి20 మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. 133 రన్స్ తేడాతో ఓడి పోయింది బంగ్లాదేశ్. దీంతో సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టి20 సీరీస్ ను ఏక పక్షంగా గెలుపొందింది.
ఈ కీలక మ్యాచ్ లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పరుగుల మోత మోగించింది భారత జట్టు. ఈ సందర్భంగా ఓపెనర్ గా ఆడిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 8 సిక్సర్లు, 11 ఫోర్లు సాధించాడు.
అంతే కాకుండా కెప్టెన్ సూర్య కుమార్ యాదవత్ తో కలిసి 173 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజూ శాంసన్ , సూర్య తో పాటు మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా అరుదైన ఫోటో పంచుకున్నారు. ఇది భారత జట్టు సాధించిన సమిష్టి విజయమని పేర్కొన్నారు.