NEWSNATIONAL

బాబా సిద్దిక్ హ‌త్య‌లో గ్యాంగ్ స్ట‌ర్స్

Share it with your family & friends

విచారిస్తున్న ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్

మ‌హారాష్ట్ర – ఎన్సీపీ లీడ‌ర్, మాజీ మంత్రి బాబా సిద్దిక్ కాల్చివేత తో మ‌రాఠా రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. త‌నతో కొడుకుతో క‌లిసి ఆఫీసు బ‌య‌ట వేచి ఉండ‌గా ముగ్గురు సాయుధులైన అగంత‌కులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఘ‌ట‌న స్థ‌లంలో బుల్లెట్లు ఉండ‌టాన్ని గుర్తించారు. కాల్పుల‌కు పాల్ప‌డిన వారిలో ముగ్గురు ఉన్న‌ట్లు గుర్తించారు పోలీసులు.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు మ‌రాఠాలో ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ద‌యా నాయ‌క్ వీరిని విచారిస్తున్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన వారిలో హ‌ర్యానాకు చెందిన క‌ర్నైల్ సింగ్ తో పాటు ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన ధ‌ర‌మ్ రాజ్ క‌శ్య‌ప్ గా గుర్తించామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నార‌ని, గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల‌కు పాల్ప‌డ‌డం వెనుక ఏమై ఉంటుంద‌నే దాని కోణంపై విచారిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రో వైపు బాబా సిద్దిక్ కాల్పుల ఘ‌ట‌న తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యేలా చేసింది.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు ఆర్జేడీ చీఫ్ , బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ స్పందించారు. ఈ ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు.