NEWSANDHRA PRADESH

ఏపీలో అల్ప పీడ‌నం జ‌ర భ‌ద్రం

Share it with your family & friends

హెచ్చ‌రించిన అనిత వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి.

పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హోం మంత్రి. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు హోం మంత్రి.

దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర,”రాయలసీమ” ప్రాంతాలలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు, గట్లను గుర్తించి పర్యవేక్షించాలని స్ప‌ష్టం చేశారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాలన్నారు.